ఆదిలాబాద్: విడుదలకు ముందే పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన కొమరంపులి మరోమారు వివాదంలో కూరుకుపోయింది. సినిమాలో ఉన్న కొమరం పేరును మార్చాలని కొమరం భీం మనుమడు కొమరం సోనీ పేర్కొన్నారు. గిరిజనుల కోసం పోరాడిన కొమరం భీం పేరును ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడంపట్ల ఆయన ఆక్షేపణ తెలిపారు. పేరును మార్చకపోతే తెలంగాణలో చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీం ఇంటి పేరును సినిమాకు వాడడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఈ పేరుపై తెలంగాణలో వ్యతిరేకత ఎదురైంది.