వైయస్ జగన్ పై ఎదురు తిరిగిన ఆనం వివేకానంద రెడ్డి

Anam Vivekananda Reddy
నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి తన విధేయతను మార్చుకున్నారు. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా మారారు. తొలినాళ్లలో ఆయన పూర్తిగా జగన్ ను సమర్థించారు. ఇప్పుడు వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యమని చెబుతూ వైయస్ జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి సిద్ధపడ్డారు. నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రలో తాను పాల్గొనబోనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. నెల్లూరులో వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపన వివాదం ఓ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ భవిష్యత్తుపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

ముందు జరగబోయే విషయాల గురించి ఇప్పుడే అడిగితే తాను ఏం చెప్పగలనని ఆయన అన్నారు. ఊహాజనిత ప్రశ్నలు వద్దని, నిర్దిష్టమైన ప్రశ్నలు వేయాలని ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు. వైయస్సార్ అల్లుడు అనిల్ కుమార్ గురించి అడిగితే అనిల్ కుమార్ ను అందరూ మర్చిపోయారని, మీకే గుర్తున్నారని ఆయన సమాధానమిచ్చారు. వైయస్సార్ కుటుంబానికి అందరం అభిమానులమేనని ఆయన అన్నారు. అయితే కాంగ్రెసు పార్టీకి విధేయంగా ఉండాలని వైయస్సార్ తమకు నేర్పారని, ఇందిరమ్మ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పారని, అందుకు అనుగుణంగానే తాము నడుచుకుంటున్నామని ఆయన వివరించారు. వైయస్ పై తమ అభిమానాన్ని, భక్తి శ్రద్ధలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. వైయస్ ను కించపరిచే హక్కు కూడా ఎవరికీ లేదని ఆయన అన్నారు.

వైయస్ కుటుంబంపై తమ అభిమానాన్ని ప్రదర్శించడానికి సమయం, సందర్భం ఉంటాయని ఆయన అన్నారు. ప్రతి రోజూ పుట్టిన రోజు, ప్రతి రోజూ వర్ధంతి నిర్వహించుకోమని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే తాను ఎంత వరకు మాట్లాడాలో అంత వరకే మాట్లాడుతానని ఆయన సమాధానమిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+