వ్యూహంలో భాగంగానే మళ్లీ బాలినేని శ్రీనివాస రెడ్డి నోట అదే మాట

Balineni Srinivas Reddy
ఒంగోలు/ నెల్లూరు: గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నోట మళ్లీ అదే మాట వచ్చింది. మంత్రి పదవి పోయినా ఫరవా లేదు, తాను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట ఉంటానని ఆయన బుధవారం చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రకు కాంగ్రెసు పార్టీవారిని కూడగట్టడంలో భాగంగానే ఆయన బుధవారంనాటి ప్రకటనను ఉద్దేశించారని భావిస్తున్నారు. ఓదార్పు యాత్రలో పాల్గొనడంలో తప్పు లేదని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రలో పాల్గొంటే పదవి పోతుందని తనను చాలా మంది బెదిరించారని, అయినా తాను భయపడలేదని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రలో పాల్గొంటే చర్యలు ఏవీ ఉండవని ఆయన ఈ మాటల ద్వారా చెప్పదలుచుకున్నట్లు భావిస్తున్నారు.

కాగా, వైయస్సారే లేకపోయిన తర్వాత తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరమని ఆయన మరోసారి అన్నారు. ఈ మాటల ద్వారా ఆయన పార్టీ అధిష్టానాన్ని రెచ్చగొట్టడానికి పూనుకున్నారా అనేది కూడా ప్రశ్న. ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏదో సమయంలో సహనం కోల్పోయి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆయన వ్యూహం కావచ్చు. తనపై చర్య తీసుకుంటే తమ రాజకీయ కార్యకలాపాల ఉధృతిని పెంచవచ్చునని అనుకుంటూ ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+