నటించబోయే కొత్త సినిమాలో హీరోయిన్లతో స్టెప్పులేస్తా: చిరంజీవి

వచ్చే ఏడాది ఇదే సమయానికి సినిమా విడుదలయ్యేలా చూస్తామని ఆయన చెప్పారు. సినిమా జనామోదం పొందేలా ఉంటుందని ఆయన చెప్పారు. సినిమా ఎంటర్టైన్ మెంట్ అందిస్తూ సామాజిక బాధ్యతను చెప్పేదిగా ఉంటుందని ఆయన చెప్పారు. సినిమా సరదాగా ఉంటేనే చూస్తారని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి సినిమాపై చెడు వ్యాఖ్యలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కుటుంబం లాంటి సినీ రంగాన్ని మిస్సవుతున్నట్లుగా ఉందని, సినీ రంగంతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఓ సినిమాలో నటించాలని అనుకంటున్నానని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వర్షం కరుణించినా ప్రభుత్వం కరుణించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు ఎరువులు లభించడం లేదని ఆయన విమర్సించారు. వీధికెక్కితే గాని సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతాయని ఆయన అన్నారు. సమన్వయ లోపం వల్ల ప్రభుత్వం పని చేయడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న సెలవు ఇచ్చినా ఫరవా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications