వైయస్ జగన్ పై చర్యలుండవని ఎవరు చెప్పారు: డి శ్రీనివాస్

పార్టీ నాయకులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడం తప్పు కాదని, అయితే వాటిని బహిరంగంగా వెల్లడించడం పార్టీ వ్యతిరేకమని ఆయన అన్నారు. పార్టీ నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకూడదని ఆయన హెచ్చరించారు. పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి నివేదిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను కూడా అధిష్టానానికి చేరవేస్తున్నట్లు ఆయన చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications