వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారు: మేకపాటి రాజమోహన్ రెడ్డి

Mekapati Rajamohan Reddy
నెల్లూరు: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ 2014 కల్లా ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర సన్నాహక సమావేశంలో కూడా ఆయన ప్రసంగించారు. వైయస్ జగన్ ను విస్మరిస్తే కాంగ్రెసుకు దుర్దశ తప్పదని ఆయన అన్నారు.

ప్రస్తుతం కాంగ్రెసుకు జగన్ వదులుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. జగన్ పై పార్టీ అధిష్టానం జగన్ పై చర్యలు తీసుకోదని కూడా ఆయన అన్నారు. పట్టుమని పది మంది కూడా వెనకలేని నాయకులు కొందరు జగన్ కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో మేకపాటి రాజమోహన్ రెడ్డి సహా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ముగిసిన వెంటనే నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రను చేపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+