పని మనిషిని కవితా కృష్ణమూర్తి భర్త లైంగికంగా వేధించారా?

సుబ్రమణ్యం తనపై అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించారని, సుబ్రమణ్యం తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని భాగ్య అంటోంది. దొంగతనం చేసిందనే ఆరోపణపై భాగ్యను పని నుంచి తొలగించారు కూడా. భాగ్యను వెంట పెట్టుకుని పోలీసులు బెంగళూర్ లోని సుబ్రమణ్యం ఇంటికి కూడా వచ్చారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. సుబ్రమణ్యానికి పద్మ భూషన్, పద్మ విభూషన్ వంటి అవార్డులు వచ్చాయి. సలాం బాంబే వంటి సినిమాలకు ఆయన సంగీతం సమకూర్చారు.
కవితా కృష్ణమూర్తిని సుబ్రమణ్యం రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కవితా కృష్ణమూర్తితో కలిసి ఆయన పలు కచేరీలు కూడా చేశారు. దేశ, విదేశాల్లో ఆయన కచేరీలు చేశారు. తాను పూర్తి కాలం సంగీతానికే అంకితం అవుతానని సినిమాలకు పాటలు పాడడం కూడా కవితా కృష్ణమూర్తి మానుకున్నారు.












Click it and Unblock the Notifications