వైయస్ జగన్ బెంగళూర్ ఇంటిపై రచ్చ: చంద్రబాబుపై ఎదురుదాడి

జగన్ బెంగళూర్ ఇంటిపై రచ్చ చేయడం సరి కాదని శ్రీకాంత్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మలేషియా, సింగపూర్ ల్లోని చంద్రబాబు హోటళ్ల గుట్టు విప్పుతామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు వందలాది ఎకరాలు సొంతం చేసుకుని ఫామ్ హౌస్ లు కట్టారని ఆయన ఆరోపించారు. దోచుకుని దాచుకోవడం చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఆయన వ్యాఖ్యానించారు. రెండు ఎకరాల ఆసామి చంద్రబాబు 3 వేల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా హెరిటేజ్ యూనిట్లను ఎలా పెడుతున్నారని ఆయన అడిగారు. జగన్ ఆస్తుల రికార్డులు స్పష్టంగా ఉన్నాయని ఆయన చెప్పారు. లేని ఆస్తులను అంటగట్టి తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకోలేదా అని ఆయన అడిగారు.
జగన్ కు సంబంధించిన నిజాలు పార్టీ అధిష్టానానికి త్వరలోనే తెలుస్తాయని ఆయన అన్నారు. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే తాము జగన్ ను బలపరుస్తున్నామని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని ఎవరూ చెప్పలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications