తెలంగాణ ఇస్తే ప్రత్యేక దేశ డిమాండ్లు వస్తాయి: కెఎస్ రావు

కొంత మంది స్వార్థపరులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను ముందుకు తెస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు ఒక ప్రాంత ప్రజలకు గానీ ఆ ప్రాంత అభివృద్ధికి గానీ ప్రయోజనం చేకూర్చేది కాదని ఆయన అన్నారు. రాజకీయ నిరుద్యోగులు ప్రత్యేక తెలంగాణను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. తమ వాదనలను కమిటీ చైర్మన్ శ్రీకృష్ణ, సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ రెండు గంటలపాటు సావధానంగా విన్నారని, వారు కేంద్రానికి తగిన సిఫార్సు చేయగలరనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. తమ పార్టీలో ప్రాంతాలవారీగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కమిటీ వద్ద ఈ విభేదాలపై చర్చకు రాలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications