పవన్ కళ్యాణ్ కొమరం పులిని అడ్డుకుంటాం: ఒయు జెఎసి

Pawan Kalyan
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి విడుదలకు ముందే రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది. అయితే ఆ అభ్యంతరాలన్నీ నిజ జీవితంలో హీరో అయిన కొమరం భీం పేరులోని కొమరం పేరుపైనే ఉండటం గమనార్హం. తాజాగా ఉస్మానియా యూనివర్శిటీ ఐకాస(ఓయూ జెఎసి) కొమరం పులి చిత్రాన్ని అడ్డకుంటామని హెచ్చరించింది. నిజ జీవితంలో హీరోయిజం ప్రదర్శించిన కొమరం భీం పేరును చిత్రానికి ఉపయోగించడంపై ఓయూ జెఎసి నాయకుడు సుమన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వాతంత్యోద్యమ కాలంలో గిరిజనుల హక్కులకై పోరాడిన సమరయోధుడి పేరును సినిమా టైటిల్ గా వాడుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు.

టైటిల్లోని కొమరం పేరును వెంటనే తొలగించాలని లేనియెడల ఆ చిత్రాన్నిఅడ్డుకుంటామన్నారు. చిత్ర నిర్మాతగాని, హీరో పవన్ కళ్యాణ్ గానీ దీనిపై పునరాలోచించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఈ వివాదానికి ముందురోజే కొమరం భీం మనుమడు సోనీరావు సైతం చిత్రం శీర్షిక(టైటిల్)లో కొమరం తొలగించకపోతే చిత్రాన్నిఅడ్డుకుంటామని హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక వివాదాలను పక్కన పెడితే ఈ చిత్రం ఈనెల 10న విడుదలకోసం సిద్ధమయింది. ఈ చిత్రాన్నీ భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+