రక్తచరిత్రపై రామ్ గోపాల్ వర్మ్కు వల్లభనేని వంశీ వార్నింగ్

Ram Gopal Varma
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. రక్తచరిత్ర సినిమాపై తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ వర్మను శుక్రవారం హెచ్చరించారు. వర్మ చీప్ ట్రిక్స్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ దివంగత నేత పరిటాల రవి చేయని పనులు చేసినట్లు సినిమాలో చూపిస్తే సినిమాను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు రామ్ గోపాల వర్మ సినిమా ద్వారా ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు గీయించినట్లు సినిమాలో ఓ దృశ్యం ఉందంటూ ప్రచారంలోకి వచ్చింది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. ఈ దృశ్యం ఉంటే రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేగుతుందని ఆయన అన్నారు. తీరని కోరికలను సినిమాల ద్వారా వర్మ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. వర్మ దయ్యం సినిమాలు, సెక్స్ సినిమాలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. హిందీ సినీ రంగంలో నష్టాల పాలై వర్మ తిరిగి తెలుగు సినిమాలపై పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+