చిరంజీవి అపీల్ వృధా: కొమరం పులిపై తెలంగాణ ఎఫెక్ట్

Chiranjeevi
హైదరాబాద్: తన సోదరుడు పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమా విషయంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చేసిన విజ్ఞప్తి వృధా అయింది. ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ తెలంగాణవాదులు సినిమాను అడ్డుకునే విషయంలో వెనక్కి తగ్గలేదు. తెలంగాణలో చాలా మంది కళాకారులున్నారని, కళాకారుల సినిమాలను అడ్డుకోవద్దని చిరంజీవి ప్రివ్యూ చూసిన తర్వాత విజ్ఞప్తి చేశారు. తమను వేరు చేసి చూడవద్దని ఆయన కోరారు. అయితే తెలంగాణవాదులు తమ పట్టు వీడడం లేదు. తెలంగాణలో సినిమా ప్రదర్శనను అడ్డుకోవడానికి ఎక్కడికక్కడ ప్రయత్నిస్తున్నారు.

పలు చోట్ల థియేటర్ యజమానులు సినిమాను ప్రదర్శించడం లేదు. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో, హైదరాబాద్ శివారుల్లో సినిమా ప్రదర్సనను తెలంగాణవాదులు అడ్డుకుంటున్నారు. హన్మకొండలో కొమరం పులి సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో మార్నింగ్, మ్యాట్నీ షోలను నిలిపేశారు. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్ ల్లో కూడా సినిమా ప్రదర్శనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వరంగల్ లో తెలంగాణవాదులు థియేటర్ల వద్ద తెలంగాణవాదులు ధర్నాకు దిగారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా ధర్నాకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+