బాలయ్య, మోహన్ బాబు సినిమాలూ అడ్డుకుంటాం: ఒయు జెఎసి

పులి చిత్రం అడ్డుకోవడాన్నిప్రజా రాజ్యం నాయకులు కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నారని ఒయు జెఎసి నాయకుడు రాజారాం అన్నారు. కాని తెలంగాణలోని ప్రజల ఆకాంక్షను వారు చూడటం లేదన్నారు. ఇకనుండి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కరి చిత్రాలను ఇక్కడ ప్రదర్శింపనిచ్చేది లేదన్నారు. పులిపై ప్రజారాజ్యం నాయకులు చేస్తున్న వాదనలన్నీ తెలంగాణ ద్రోహి అయిన చిరంజీవిని సంతృప్తిపర్చడానికేనన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ లో కొమరం పదాన్ని తొలగించినంత మాత్రాన సరిపోదని, సినిమాలో సంభాషణలు కూడా మార్చాలని ఒయు జెఎసి నాయకులు అన్నారు.












Click it and Unblock the Notifications