పవన్ ఫ్యాన్స్ వీరంగం: విజయనగరం జిల్లాలో థియేటర్ పై దాడి
State
oi-Pratapreddy
By Pratap
విజయనగరం: థియేటర్ కు ప్రింట్లు ఆలస్యం కావటంతో విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ చిత్రం కోసం స్థానిక సీతారామాంజనేయ థియేటర్ కు శుక్రవారంనాడు ఉదయాన్నే వచ్చారు. అయితే గంటల కొద్ది వేచి చూసినప్పటికీ ప్రింట్స్ రాక పోవటంతో రెచ్చిపోయిన అభిమానులు థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు.
కోనసీమలోని పలు ప్రాంతాలకు పులి సినిమా బాక్స్ లు ఆలస్యంగా చేరుకున్నాయి. సకాలంలో వాటిని థియేటర్లకు అందించడంలో విఫలమయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకు, అసహనానికి గురయ్యారు.