వైయస్ జగన్ దేవుడు విధించే ఏ శిక్షకైనా అర్హుడేనన్న సోనియా

ముఖ్యమంత్రిగా బాగా డబ్బు (మింటెడ్ మనీ) సంపాదించుకున్నారని తెలిసీ కూడా రాజశేఖర రెడ్డి పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగించామని, ఆ సమయంలో వైయస్సార్ అపరిమితమైన అధికారాన్ని చెలాయించారంటూ సోనియా ప్రస్తావించినట్లు సమాచారం. వైఎస్ తోపాటు ఆయన కొడుకుగా జగన్ కూడా అపరిమితమైన అధికారాన్ని చెలాయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని అధినేత్రి అన్నట్లు తెలిసింది. వైఎస్ కుటుంబానికి తాము ఇచ్చిన చేయూతను చూసి జగన్ జీవితాంతం కాంగ్రెస్ కు రుణపడి ఉండాలని ఆమె ఆవేదనతో కూడిన స్వరంతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. జగన్ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ రాష్ట్ర నాయకులు చెప్పినప్పుడు "డబ్బుంది కదా పార్టీ పెడతారు. చూద్దాం" అని సోనియా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications