వారంతా కొట్టుకుపోతారు: వైయస్ జగన్ శాపనార్థాలు

YS Jagan
ఒంగోలు: తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నవారికి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శాపనార్థాలు పెట్టారు. ప్రజల ఆదరణ, ఆప్యాయత ముందు వైయస్సార్ పై ఆరోపణలు చేస్తున్నవారు కొట్టుకుపోతారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన తన ఎనిమిదవ రోజు యాత్రను పెదదోర్నాల నుంచి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. మరణించిన వ్యక్తిపై బురద చల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని, బతికి ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేస్తే అతను నిలబడి సమాధానం చెప్పడానికి వీలుంటుందని, అయితే కొంత మంది మరణించిన తన తండ్రిపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

మరణించిన వ్యక్తిపై బురద జల్లే నికృష్టపు స్థితికి రాజకీయాలు చేరుకున్నాయని, రాజకీయాలలు స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఎవరేమన్నా ఫరవా లేదని, తనకు దేవుడి బలం ఉందని, తండ్రి ఆశీస్సులున్నాయని ఆయన అన్నారు. వైయస్ అభిమానుల గుండె చప్పుడు తనకు తోడుగా ఉందని, వారి అభిమానం ముందు వారంతా కొట్టుకుపోతారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+