టిజి వెంకటేష్ కున్న అర్హతలేమిటో: తెరాస నేత హరీష్ రావు

భూముల బాగోతాలను బయటపడతాయనే టిజి వెంకటేష్ తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. టిజి వెంకటేష్ కు ఇచ్చిన భూములపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఎమ్మార్ వ్యవహారంలో భూములు కోల్పోయినవారికి తక్షణమే భూములు కేటాయించాలని ఆయన అన్నారు. భూములు కోల్పోయినవారికి నష్టపరిహారం చెల్లించడంలో తెలంగాణవారికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications