హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓయూ విద్యార్థి జెఎసి చిరంజీవి ఇంటిని ముట్టడిస్తుందని సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయినట్లు సమాచారం. చిరంజీవి ఇంటి ముట్టడిస్తారన్న వార్తలను పీఆర్‌పీ నేతలు ఖండించారు. అయితే ఈ భారీ బందోబస్తుకు మాత్రం కారణం చెప్పలేదు. ఇక కొమరం పులి నిర్మాతల నుంచి ఒయు జెఎసి నాయకులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణపై రెండు రోజులుగా వివాదం జరుగుతోంది. ప్రకటనల ద్వారా తమ పరువుకు భంగం కలిగించారని, విశ్వవిద్యాలయం వాతావరణాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉస్మానియా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా ప్రజారాజ్యం పార్టీ వర్గాలు కొన్ని వ్యాఖ్యలు చేసాయి.