న్యూయార్క్: సెప్టెంబరు 11న జరిగిన దాడులలో మృతులకు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ ఈ దాడులకు ప్రధాన కారకుడైన లాడెన్‌ని పట్టుకు తీరుతామని చెప్పారు. తమ యుద్ధం ఉగ్రవాదంపైనేకానీ, ఇస్లామ్ పై కాదని ఆయన స్పష్టం చేశారు.