హరీష్ రావు షాక్ ట్రీట్ మెంట్ ఇప్పించాలి: టీజీ వెంకటేష్
State
oi-Surya Prakash Josyula
By Srikanya
"హరీష్ రావును జైలులో పెట్టినా సమస్య పరిష్కారం కాదు. ఆయనకు షాక్ ట్రీట్‌మెంట్ ఇప్పించాలి. కేసీఆర్ కు తెలంగాణ గజ్జి పట్టుకుంది. దీనిని ఆయన తెలంగాణ నాయకులందరికీ అంటించారు. దీంతో ఆ నాయకులు నెత్తురు వచ్చేలా గోక్కుంటున్నారు. తుగ్లక్ తన రాజధానిని మార్చినట్లుగా టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ అంశాన్ని మార్చి మార్చి మాట్లాడుతున్నారు. ఇది సరికాదు" అని గ్రేటర్ రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అధ్యక్షుడు, కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేశ్ ఎదురు దాడికి దిగారు. అలాగే తనకు పిచ్చి పట్టిందని, పిచ్చాసుపత్రిలో చేర్చాలని వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై హరీశ్ రావు వైఖరి పిచ్చి తుగ్లక్ లా ఉందన్నారు. టీజీ కర్నూలులో మీడియాతో మాట్లాడారు.