రంగారెడ్డి: పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి ఇంటి ముందు టీఆర్ ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జి జరుపగా ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు అల్పాహార విందుకై పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసం వద్ద ఆగారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి చేరుకుని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హరీశ్వర్‌రావు ఇంటిలోనికి వెళ్లేందుకు యత్నించారు.