మహబూబ్ నగర్: చేవెళ్లలో చంద్రబాబు వాహనశ్రేణిని అడ్డుకునేందుకు తెలంగాణవాదులు యత్నించారు. ఎరువుల కొరతపై రైతులతో కలసి పోరాడేందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణ వాదులు నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును సోమవారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు చేవెళ్లలో అడ్డుకున్నారు. తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టని కారణంగా ఎరువుల కోసం జిల్లాలో రైతన్నలు ఇబ్బంది పడాల్సి వస్తోందని, ప్రభుత్వ చర్యలు నిరసనగా జిల్లా కేంద్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఆందోళన చేపట్టనుంది.