చిరంజీవీ!ముక్కు నేలకు రాస్తవా: కె. చంద్రశేఖర రావు

రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇరుప్రాంతాల ప్రజల మధ్య సోదరభావం ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. కానీ, చిరంజీవి లాంటి వారు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే ఎలాగని ప్రశ్నించారు. వరంగల్ జిల్లాకు చెందిన తెదేపా నేత ఒకరు తెరాసలోకి వస్తానన్నారని, కానీ, అంతలోనే ఆ జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ఆయన ఇంటికి వెళ్లి తెరాసలోకి వెళ్లొద్దని చెప్పారని కెసిఆర్ తెలిపారు. దమ్ముంటే చంద్రబాబును గొర్రెలా తీసుకెళ్లి శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇప్పించాలన్నారు. సీమాంధ్ర నేతలు హైదరాబాద్ గురించి అనవసర పేచీ పెడుతున్నారనీ, ఇలాగే మాట్లాడితే రేప్పొద్దున ఆంధ్రవారు సచివాలయం ఏర్పాటు చేసుకునేవరకు కూడా ఇక్కడ ఉండనిచ్చేది లేదంటూ హెచ్చరించారు. ఎంపీ మధుయాస్కీ బాధ్యతాయుతంగా మాట్లాడినా నీతి, జాతిలేని సీమాంధ్ర పెద్ద మనుషులు ఇష్టమున్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications