హైదరాబాద్: రక్తాన్ని అమ్ముకునే చిరంజీవి ఓయూ విదాయర్థులపైన అనవసర ఆరోపణలు చేయడం సిగ్గుచేటని పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. ఓయూ జేఏసీపై చిరు ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు చిరంజీవి క్షమాపణ చెప్పాలని సురేఖ అన్నారు. తానూ తెలంగాణ వాదినేనని సురేఖ చెప్పారు. ఇక కొమరం పులి నిర్మాతల నుంచి ఒయు జెఎసి నాయకులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణపై రెండు రోజులుగా వివాదం జరుగుతోంది. ప్రకటనల ద్వారా తమ పరువుకు భంగం కలిగించారని, విశ్వవిద్యాలయం వాతావరణాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉస్మానియా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా ప్రజారాజ్యం పార్టీ వర్గాలు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసాయి. ఇప్పుడు సురేఖ రంగంలోకి దిగింది.