చంద్రబాబూ నీకు మగతనముంటే...!? రఘువీరా రెడ్డి సవాల్

"మహబూబ్‌నగర్ జిల్లాలో ఎరువుల లారీపైకి రైతులను రెచ్చగొట్టింది టీడీపీ ముసుగులో ఉన్న గూండాలే. గతంలో ఏవో కారణాలతో ఓ రైతు చనిపోతే...ఎరువులు దొరక్కే ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలా? అనవసరంగా రైతుల్లో గందరగోళం సృష్టించకండి. అధికారంలో ఉన్నన్నాళ్లూ రైతుల ఉసురు పోసుకున్నావు. సర్వ నాశనం చేశావు. ఇప్పుడు మళ్లీ వారిని ఎందుకు నాశనం చేస్తావు?" అని రఘువీరా ప్రశ్నించారు. "మీ దరిద్ర పాలనలో కనీసం ఎరువులు కావాలని, రుణాలు ఇంకా కావాలని అడిగే దిక్కు కూడా లేదు కదా?" అని ఆయన విమర్శించారు. అలాగే రాష్ట్రంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ ద్వారా ఉత్పత్తయ్యే యూరియాను పూర్తిగా ఇక్కడి అవసరాలకే వాడుకుంటున్నామన్నారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లోని మానిటరింగ్ సెల్‌కు వచ్చిన మొత్తం 530 ఫిర్యాదులు పరిష్కరించామని రఘువీరా తెలిపారు.












Click it and Unblock the Notifications