చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్శు రువ్విన తెలంగాణ ఉద్యమకారులు..!
State
oi-Nageshwara Rao M
By Nageswara Rao
రంగారెడ్డి: మహాబూబ్ నగర్ జిల్లాలోని రైతులకు ఎరువులు మరియు పురుగుమందులు దోరక్క ఇబ్బందులు పడుతున్నారని వారిని ఒదార్చడానికి వెళ్శిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద తెలంగాణ ఉద్యమకారులు రాళ్శు రువ్వడంతో అక్కడ పరిస్ధితి కోంచెం విషమంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జి జరుపగా ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాలయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులు రాళ్శు రువ్వుతున్న సమయంలో ఆయన కారు డ్రైవర్ చాలా చాకచక్యంగా ఆ రాళ్శ నుండి చంద్రబాబునాయుడుని తప్పించారు. అంతేకాకుండా ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా తీవ్రగాయాలయ్యాయని వారు వెల్లడించారు. హైదరాబాద్ కు 70 కిమీ దూరంలో పరిగి అనే ఊరిలో ఈ సంఘటన మధ్యాన్నం చోటు చేసుకుంది. దానితో ఆగ్రహించిన తెలంగాణ వాదులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీనికి అంతటికి కారణం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేయకపోవడమేనని అంటున్నారు.