ఖమ్మం: సింగరేణి ఉద్యోగుల తెలంగాణ జెఎసి కో-కన్వీనర్, మెయిన్ ఆస్పత్రిలో సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ శంకర్ నాయక్ కు యాజమాన్యం ఇచ్చిన షోకాజ్ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇందుకు సహకరించిన సీమాంధ్ర అధికారులపై చర్యలు తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ జెఎసి అన్ని సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. సింగరేణి కార్యాలయాన్ని తెలంగాణ జెఎసి నేతలు ముట్టడించారు. జెఎసి నేత శంకర్ నాయక్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌ను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అన్ని తెలంగాణ జెఎసి ప్రజాసంఘాలు, టీఆర్ఎస్, బీజేపి తదితర రాజకీయపార్టీల ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.