విశాఖలో వింత: రెండు రోజులుగా గణేశుడి సేవలో రామచిలుక
Districts
oi-Pratapreddy
By Pratap
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఓ వినాయక మండపంలో రామచిలుక ప్రజలకు దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం మండపంలోకి వచ్చి వెళ్లటం కాకుండా రెండురోజులుగా అక్కడే ఉండటంతో భక్తులందరూ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నారు. సోమవారం ఉదయం లంబోదరుని మండపానికి వచ్చిన చిలుక మంగళవారం వరకు అక్కడే ఉంటూ వినాయకుడి సేవలో తరిస్తోంది.
రామచిలుకను చూడడానికి నగరవాసులు పెద్ద యెత్తున ఆ వినాయకుడి మండపానికి వస్తున్నారు. రామచిలుక ఉదంతాన్ని నగర ప్రజలు కథకథలుగా చెప్పుకుంటున్నారు.