మీడియాపై ముఖ్యమంత్రి కె. రోశయ్య చురకలు

ఈసారి సకాలంలో ఒకేసారి రాష్ట్రమంతా వర్షాలు పడ్డాయని, దీంతో ఒకేసారి రాష్ట్రమంతా ఎరువులకు డిమాండ్ పెరిగిందని, డిమాండ్ కూడా పెరిగిందని, అయినా సకాలంలోనే ఎరువులను అందించామని ఆయన అన్నారు. రాష్టంలో ఎరువుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు ఎరువులను సక్రమంగానే సరఫరా చేశామని ఆయన అన్నారు. ఈ ఏడాది రెండు కోట్ల పది లక్షల టన్నుల ఆహారధాన్యాల దిగుబడి ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 48 వేల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని, వాటిని రాష్టానికే కేటాయించే విధంగా కేంద్రాన్ని ఒప్పిస్తామని ఆయన చెప్పారు. ఇంత వరకు రైతులకు సరఫరా చేసిన ఎరువుల వివరాలను కూడా ఆయన మీడియాకు అందించారు.












Click it and Unblock the Notifications