కె చంద్రశేఖర రావుపై తొడ గొడుతున్న చంద్రబాబు నాయుడు

మరోవైపు, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కూడా ఆయన తగిన జవాబు చెప్పేందుకు ప్రయత్నించారు. తన ఆస్తులపై వైయస్ జగన్ వర్గం చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వైయస్ జగన్ ఆస్తులతో తన అస్తులను పోల్చి చూస్తే తన ఆస్తులు లెక్కలోకి కూడా రావనే పద్ధతిలో మాట్లాడారు. తన ఆస్తుల విలువ మొత్తం 200 కోట్ల రూపాయలు చేస్తుందని, అందులోనూ ఎక్కువ భాగం తన రెండెకరాల భూమి విలువ మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. ధరలు తక్కువగా ఉన్నప్పుడు హైదరాబాద్ శివారులో కొన్న రెండెకరాల భూమి విలువ రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల పెరిగిందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications