హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియా లేడీస్ హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. హైదరాబాదులోని కోఠీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్రవంతి అనే విద్యార్థిని గురువారం ఉదయం మంచంపై అచేతనావస్థలో పడి ఉంది. స్రవంతి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు స్రవంతి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.

స్రవంతికి ఫిట్స్ ఉన్నట్లు, అందుకు ఆమె చికిత్స పొందుతున్నట్లు సహ విద్యార్థినులు చెబుతున్నారు. అయితే ఆమె బుధవారంనాడు మామూలుగానే ఉందని, గురువారం ఉదయం చూసేసరికి ఆమె అచేతనావస్థలో పడి ఉందని చెప్పారు. వైద్యులు పరీక్షించారు. అయితే, అప్పటికే ఆమె మరణించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X