వికె దుగ్గల్ తో కేంద్ర మంత్రి పురంధేశ్వరి భేటీ ఆంతర్యం ఏమిటి?

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి తన అభిప్రాయాలను ఆమె ఈ సందర్భంగా దుగ్గల్‌కు చెప్పినట్టు సమాచారం. తెలంగాణపై ఇప్పటి వరకు ఆమె తన వైఖరిని బహిరంగంగా వ్యక్తం చేయలేదు. ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమా, అనుకూలమా అనేది తెలియదు. అయితే, ఆమె భర్త, కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారు. తన వైఖరిని స్పష్టం చేస్తూ ఆయన ఓ పుస్తకం కూడా రాశారు. దుగ్గల్ తో ఏం మాట్లాడారనే విషయాన్ని వెల్లడించడానికి పురంధేశ్వరి మీడియా ప్రతినిధుల వద్ద నిరాకరించారు.












Click it and Unblock the Notifications