నాగార్జునరెడ్డి రాజీనామాను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి

కాగా, రాష్ట్ర హైకోర్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. హైకోర్టులోకి ప్రవేశాన్ని పోలీసులు పరిమితం చేశారు. కేసులు ఉన్న న్యాయవాదులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. హైకోర్టు వద్ద దాదాపు 2 వేల మంది పోలీసులు మోహరించారు. సెప్టెంబర్ 17వ తేదీన న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలకు దిగవచ్చుననే ఉద్దేశంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో పరిస్థితిని మెరుగు పరచాలని, లేదంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు కొలీజయం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. హైకోర్టు కొలీజియం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది.












Click it and Unblock the Notifications