కాంగ్రెసులో తెలంగాణ కలవరం: ప్రజాప్రతినిధులకు డి శ్రీనివాస్ లేఖ

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సంయమనం పాటించాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వ్యక్తిగతంగా రాసిన లేఖల్లో ఆ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కట్టుబడి ఉన్నారని డీఎస్ అందులో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే పనిలో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతల పరస్పర విమర్శలు, ప్రకటనలు ప్రాంతీయ ద్వేషాలు రగిల్చే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు తమ అభిప్రాయాలను అంతర్గతంగా వెల్లడించాలి తప్ప, మీడియాకు ఎక్కి అనవసర విమర్శలు చేయవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications