జస్టిస్ నాగార్జున రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు?

రెండో రోజు పటిష్ఠమైన భద్రత ఉండటంతో నాగార్జునరెడ్డి కోర్టులోకి వారు వెళ్లలేదు. మూడో రోజైన గురువారం కోర్టు నిర్వహిస్తుండగా ఆటంకపరచడానికి విఫలయత్నం చేశారు. ఉదయం జస్టిస్ టి.మీనాకుమారి సర్దిచెప్పడంతో వెళ్లిపోయిన న్యాయవాదులు మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో మరోసారి నినాదాలతో దూసుకువచ్చారు. ఈ సంఘటనల నేపథ్యంలో జస్టిస్ నాగార్జునరెడ్డి తాను రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
1979లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా 2006 సెప్టెంబరు 11న బాధ్యతలు స్వీకరించారు. 27 సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగా సేవలు అందించారు.












Click it and Unblock the Notifications