నిజాంతో అగ్రిమెంట్, ముస్లిమ్ లు: తెలంగాణ విలీనంతో సరి

ఆ రోజున ఉత్సవాలను నిర్వహిస్తే తనకు అవమానమని, అందువల్ల ఉత్సవాలు జరుపుకోవద్దని మీర్ ఉస్మాన్ అలీఖాన్ అన్నట్లు, దానికి భారత ప్రభుత్వం అంగీకరించిన తర్వాతనే లొంగిపోవడానికి నిజాం అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో నిజాం ప్రభుత్వానికి మద్దతుగానే మజ్లీస్ విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తోందని, ఆ కారణంగా ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదరవుతోందని అంటున్నారు. ముస్లింల వ్యతిరేకతను గమనించిన రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17వ తేదీన రాజకీయ పార్టీలు విమోచన దినోత్సవంగా కాకుండా విలీన దినంగా నిర్వహించాయి. కాంగ్రెసు పార్టీ తన కార్యక్రమానికి విలీన దినంగానే పేరు పెట్టింది. తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తెలంగాణ జెఎసి కూడా విలీన దినంగానే పాటించాలని పిలుపునిచ్చింది. తెలుగుదేశం పరిస్థితి కూడా అదే.












Click it and Unblock the Notifications