పురంధేశ్వరి విశాఖపట్నానికి చుట్టుచూపుగానే వస్తారట

ఎన్నికల్లో నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను పురంధేశ్వరి మరిచిపోయారని ఆయన అన్నారు. పురంధేశ్వరి సామర్థ్యంపై తనకు విశ్వాసం ఉందని అంటూనే ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని తప్పు పట్టారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆమె చేసింది శూన్యమని ఆయన అన్నారు. విశాఖపట్నానికి అంతర్జాతీయ హోదాను సంపాదించి పెట్టడంలో ఆమె పూర్తిగా విఫలమయ్యారని శ్రీనివాస రావు అన్నారు. రైళ్ల విషయంలో కూడా ఆమె న్యాయం చేయలేకపోయారని ఆయన అన్నారు. చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications