గాంధీలో కొనసాగుతున్న తెలంగాణ న్యాయవాదుల నిరాహార దీక్ష

అయితే న్యాయవాదులు మాత్రం తమ దీక్షను గాంధీ ఆసుపత్రిలోనే కొనసాగిస్తున్నారు. వారు వైద్యానికి నిరాకరిస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి భారీ సంఖ్యలో లాయర్లు అక్కడికి తరలి వస్తున్నారు. హైకోర్టులో ముగ్గురు న్యాయవాదులు దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించటంతో మిగతా వారు కొనసాగించడానికి సిద్ధపడ్డారు. అయితే దానిని పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు వద్ద ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా హైకోర్టు న్యాయమూర్తి నాగార్జునరెడ్డి రాజీనామాను ఉపసంహరించుకోవాలని పలువురు కోరుతున్నారు. అయినప్పటికీ ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకోవడానికి తిరస్కరిస్తున్నారు.












Click it and Unblock the Notifications