హైదరాబాద్: తెలంగాణ, అంధ్ర ప్రాంతీయవాదం ఒక్కొక్కరిని అందరినీ తాకుతోంది. తమకు అన్యాయం జరుగుతోందంటూ ఈ మధ్య తెలంగాణకు చెందిన పలు ఉద్యోగసంఘాలు ప్రజల ముందుకు వస్తున్నువి. ఇంతకుముందు సైతం తమతమ డిమాండులు ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చినప్పటికీ ఈ మధ్య ఇది చాలా ఎక్కువ అయ్యింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ వైద్యుల సంఘంలో విభేదాలు తలెత్తాయి. హైదరాబాద్, కోఠిలోని ఆంధ్రప్రదేశ్ వైద్యుల సంఘం ప్రధాన కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్ర వైద్యుల మధ్య సమన్వయ కమిటీ విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. అసోసియేషన్ లో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్యులు డిమాండ్ చేయటంతో వాగ్వాదం చోటు చేసున్నట్టు సమాచారం.