హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కలుషిత ఆహారం తిని 40మంది వైద్యులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆసుపత్రిలో ఓసదస్సులో 40మంది వైద్యులు పాల్గొన్నారు. సమావేశం మధ్యలో స్నాక్స్ తీసుకునే సమయంలో పద్మారావునగర్‌లోని ఓ బేకరీ నుంచి తెచ్చిన ఆహారపదార్థాలను వీరు తిన్నారు. ఐతే ఆ పదార్థాలు తిన్న తరువాత శనివారం నుంచి వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఆయా వైద్యులు తమ తమ ప్రాంతాల్లో చికిత్స చేయించుకుంటున్నట్లు సమాచారం. కాగా సంబంధిత అధికారులు పద్మారావునగర్ లోని ఆ బేకరీని పరిశీలించారు.