నిధులు సద్వినియోగం చేసుకోవాలి: కేంద్ర మంత్రి పురంధేశ్వరి
State
oi-Srinivas G
By Srinivas
కర్నూలు: విద్యార్ధులు విద్యను అభ్యసించడానికి ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను తప్పకుండా సద్వినియోగపరచుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పురంధేశ్వరి సూచించారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు ప్రవేశ పెడుతున్నాయని వాటిని విద్యార్థులు ఉపయోగించుకొని విద్యను మంచిగా కొనసాగించాలని కర్నూలులో అన్నారు. 80 లక్షల రూపాయలతో చేపట్టనున్న భవనాల శంకుస్థాపన చేసేందుకు ఆమె వచ్చారు. అక్కడి రాంభోట్ల దేవాలయం వద్ద వినాయకుని దర్శించుకున్నారు.