ఢిల్లీలో తీవ్రవాదుల కాల్పులు:ఇద్దరు విదేశీ పర్యాటకులకు గాయాలు
National
oi-Srinivas G
By Srinivas
ఢిల్లీ: ఢిల్లీలోని జామామసీదు వద్ద టూరిస్టు బస్సుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరి తైవాన్ దేశ పర్యాటకులకు యాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కామన్ వెల్త్ క్రీడలు ఉండటంతో విదేశీయులను టార్గెట్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తీవ్రవాదులు గతకొంతకాలంగా భారతదేశాన్ని పర్యటిస్తున్న విదేశీయులను టార్దెట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ముంబయిలోని తాజ్ హోటల్ తోపాటు,పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపి వందలమందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు విదేశీ పర్యాటకులపై దుండగులు విరుచుకుపడ్డారు. భారత దేశానికి ఈ మధ్య విదేశీ పర్యాటకుల రాక అధికమైంది. దేశానికి విదేశీ వర్యాటకుల తాకిడి పెరగడంతో వర్యాటకాన్ని దెబ్బ తీయడాన్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలా చేస్తే దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆ తర్వాత భారత్ ను అన్ని విధాల దెబ్బ తీయవచ్చుననే ఉద్ధేశ్యం వారిలో కనిపిస్తుంది.