కొత్తగూడెంలో ప్రజారాజ్యం పార్టీ సమావేశాన్ని అడ్డుకున్న తెలంగాణవాదులు
Districts
oi-Srinivas G
By Srinivas
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రజారాజ్యంపార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, సమైక్యవాదులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ సభ జరుగుచున్న చోట ఆందోళన నిర్వహించారు. నినాదాలు చేస్తూ సభాప్రాంగణం వైపు దూసుకు రావడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ప్రరాపా, తెలంగాణ వాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పూనుకున్నారు. తెలంగాణవాదులు ప్రజారాజ్యం జండాను తగలబెట్టారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యవర్గ సమావేశానికి పిఆర్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతమ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు హాజరయ్యారు.