లగడపాటి రాజగోపాల్ తో కె చంద్రశేఖర రావు మ్యాచ్ ఫిక్సింగ్?

మరఠ్వాడాకు చెంది హైదరాబాదులో పుట్టి పెరిగిన ఓ వ్యక్తికి తెలంగాణ న్యాయవాదులు ఇక్కడ ఉద్యోగం ఇవ్వకూడదని వాదించడం పట్ల కెసిఆర్ తీవ్ర ఆక్షేపణ తెలిపారు. కెసిఆర్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ న్యాయవాదుల జెఎసి కన్వీనర్ ఎం రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్రులతో కెసిఆర్ కుమ్మక్కయ్యారని కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి విమర్శించారు. కెసిఆర్ తో తెలంగాణ రాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మొత్తం మీద, కెసిఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో తీవ్ర వివాదం తలెత్తింది.












Click it and Unblock the Notifications