తెలంగాణకు కౌంటర్: ఎదురుదాడులకు చిరు ఫోర్స్

చిరంజీవి కుటుంబ సభ్యులపై, వారి సినిమాలపై దాడులు చేసే ఎదురు దాడులు చేయడానికి తాము వెనకాడబోమని చిరంజీవి అభిమానుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు కరాటే ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. చిరంజీవి కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్నవారిని మీడియా హీరోలుగా చిత్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. చిరంజీవి కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్న విద్యార్థులపై, నాయకులపై ఎదురు దాడులు చేయడానికి తాము మందిని పంపుతామని చిరంజీవి అభిమానుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చెప్పారు.
చిరంజీవిని పదే పదే విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని చిరు ఫోర్స్ హెచ్చరించింది. చిరంజీవి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దంగా ఉన్నామని చెప్పింది. చిరంజీవిని అణగదొక్కాలని చూస్తూ ఊరుకోమని చెప్పింది. రాష్ట్రాలెన్ని ఉన్నా చిరంజీవి ఒక్కడేనని చిరు ఫోర్స్ నాయకులు అన్నారు. తెలంగాణకు చిరంజీవి వ్యతిరేకం కాదని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సిఫారసుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. కళలను, రాజకీయాలను ఒక్కటిగా చూడవద్దని వారు అభిప్రాయపడ్డారు. చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తే తాము ముందుండి నడిపిస్తామని వారు చెప్పారు. సినీ నటి జీవిత చిరంజీవిని విమర్శించడాన్ని వారు తప్పు పట్టారు. జీవిత సోదరుడికి ప్రాణదానం చేసింది చిరంజీవి బ్లడ్ బ్యాంకేనని వారన్నారు.












Click it and Unblock the Notifications