అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలోని సిర్పూర మండలం చింతకుంట్లలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. చింతకుంట్లలోని చెరువులో నిమజ్జనానికి తరలించిన వినాయకుడితోపాటు ఆటా పాటలతో దినేష్, తిరుపతి, నరేష్ అనే ముగ్గురు ఎనిమిదేళ్లలోపు చిన్నారులు వెళ్లారు. వినాయకుడిని నిమజ్జనం చేస్తుండగా విగ్రహానికి కట్టిన తాడుతో పాటు వారు ముగ్గురు కూడా నీళ్లలోకి వెళ్లారు.
వినాయక విగ్రహం అడుగు భాగంలోకి వారు వెళ్లటంతో రక్షించలేని పరిస్థితి ఎదురయింది. దాంతో వారు చెరువులో ఊపిరాడక మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.