రవీంధ్రనాథ్ రెడ్డికి మరో షాక్: భూముల ఆక్రమణపై విచారణ
State
oi-Pratapreddy
By Pratap
నల్లగొండ: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బావ మరిది రవీంద్రనాథ్ రెడ్డికి మరో షాక్ తగిలింది. రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన హరిత ఫర్టిలైజర్స్ ప్రభుత్వ భూముల ఆక్రమణపై ఆర్డీవో విచారణకు ఆదేశించారు. దీనిపై దామరచర్ల తహసీల్దార్ విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నారు. హరిత ఫర్టిలైజర్స్ ప్రభుత్వ భూముల ఆక్రమణపై మీడియాలో పలుకథనాలు రావడంతో ఆర్డీవో విచారణకు ఆదేశించారు.
ఎరువుల అక్రమ రవాణాపై ఇప్పటికే రవీంద్రనాథ్ రెడ్డి పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయారు. రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన హరిత ఫెర్టిలైజర్స్ కూడా ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుంది.