యెడ్యూరప్పపై తిరుగుబాటుకు గాలి జనార్దన్ రెడ్డి రెడీ

గుళహట్టి శేఖర్ కు ఉద్వాసన పలకడంపైనే కాకుండా యెడ్యూరప్పకు సన్నిహితులైన శోభ రంద్లాజే, వి. సోమణ్ణలకు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై గాలి జనార్దన్ రెడ్డి వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. తన అనుయాయులతో గాలి జనార్దన్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జగదీశ్ శెట్టర్ ఇంట్లో సమాలోచనలు జరిపారు. మంగళవారం ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశానికి గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, శ్రీరాములు, జగదీశ్ శెట్టర్ హాజరు కాలేదు. ఈ స్థితిలో అసంతృప్తిని చల్లార్చేందుకు యెడ్యూరప్ప తన అనుచరులతో చర్చలు జరిపారు. ఏమైనా, మరోసారి యెడ్యూరప్ప ప్రభుత్వం చిక్కుల్లో పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications