హరీష్ రావు వంతు: లగడపాటి రాజగోపాల్ పై ప్రశంసలు

Harish Rao
హైదరాబాద్: సమైక్యవాది విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను ప్రశంసించి చిక్కుల్లో పడిన తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉదంతాన్ని మరిచిపోక ముందే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అదే పని చేశారు. లగడపాటి రాజగోపాల్ ను ఆయన కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ముఖ్యమంత్రి రోశయ్యల కన్నా లగడపాటి రాజగోపాల్ నయమనవి హరీష్ రావు మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వారిద్దరు సమైక్యవాదుల కోవర్టులు కాగా, లగడపాటి ఓవర్ట్ అని ఆయన అన్నారు.

కోవర్టుల కన్నా ఓవర్టులు నయమని, చంద్రబాబు, రోశయ్యల వైఖరులు ప్రమాదకరమని, వారు అర్థం కారని, సమైక్యవాది లగడపాటి రాజగోపాల్ ను అర్థం చేసుకోవడం సులభమని ఆయన అన్నారు. తమ నేత కెసిఆర్ లగడపాటిని ప్రశింసించిన విషయంపై హరీష్ రావు వివరణ ఇచ్చారు. కెసిఆర్ లగడపాటిని పొగడలేదని, వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య లగడపాటిని పొగిడినట్లుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+