గణేశుని లడ్డు దక్కకపోవడంతో గుండెపోటుతో వ్యక్తి మృతి
Districts
oi-Srinivas G
By Srinivas
ఖమ్మం: వినాయకుని లడ్డు దక్కలేదని ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చంద్రుగొండ మండలంలోని దామరచెర్ల గ్రామానికి చెందిన లక్షయ్య అనే వ్యక్తి వినాయకుని లడ్డు కోసం వేలం పాట పాడాడు. అయితే మరొకరు ఆయనకన్నా ఎక్కున పాడి లడ్డు సొంతం చేసుకోవటంతో ఆయనకు దక్కలేదు. దీంతో లక్షయ్య లడ్డు తనకు రాక పోవడంతో నిరాశ చెంది గుండెపోటుతో మరణించాడు.